పప్పు బాలేదని చెఫ్‌ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే..ఇలాంటి ఫుడ్ నాకు పెడతారా..అంటూ..!
పప్పు బాలేదని చెఫ్‌తో పాటు క్యాటీన్ సిబ్బంపై ఒక ఎమ్మెల్యే దాడికి దిగారు. ఇలాగే వండేది. ఇలాంటివి మా ఎమ్మెల్యేలకు వడ్డీస్తారా? అంటూ క్యాంటిన్ సిబ్బందిని బూతులు తిట్టారు.
పప్పు బాలేదని చెఫ్‌ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే..ఇలాంటి ఫుడ్ నాకు పెడతారా..అంటూ..!
పప్పు బాలేదని చెఫ్‌తో పాటు క్యాటీన్ సిబ్బంపై ఒక ఎమ్మెల్యే దాడికి దిగారు. ఇలాగే వండేది. ఇలాంటివి మా ఎమ్మెల్యేలకు వడ్డీస్తారా? అంటూ క్యాంటిన్ సిబ్బందిని బూతులు తిట్టారు. వివరాల్లోకి వెళితే..
ఒక ఎమ్మెల్యే క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా పప్పు తిన్నారు. వెంటనే దాని అక్కడే పడేసి పప్పు ఇలా వండుతారా? ఇలాంటి వంటలు ఎమ్మెల్యేకు పెడతారా? అంటూ క్యాంటిన్ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఆ ఎమ్మెల్యే బుల్దానాకు చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. ఈయన ఎమ్మెల్యే రిసిడెన్స్‌లో ఉండగా అక్కడ క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. కాసేపటి తర్వాత ఆయన చపాతీ, పప్పు తెప్పించుకున్నారు. అయితే రెండు ముద్దలు పెట్టుకున్న వెంటనే పప్పు వాసనరావడాన్ని గుర్తించారు. వెంటనే లేచి ఈ పప్పు ఎవరు వండారు అంటూ లేచి క్యాంటీన్ సిబ్బందిని ప్రశ్నించారు.
చేతిలో పప్పును పట్టుకుని దీని వాసన చూడండి అంటూ.. స్టాఫ్ ముక్కు దగ్గర పెట్టారు. కొంత తింటేనే తనకు కడుపు నొప్పి వచ్చిందని, ఒక ఎమ్మెల్యేకు ఇలాంటి ఫుడ్ పెడతరా అంటూ వాళ్లని ప్రశ్నించారు. మాకే ఇలాంటి ఫుడ్ పెడితే సామాన్యుల పరిస్థితి ఏంటని? వారిని నిలదీశారు. సిబ్బంది వెళ్లి క్యాంటీన్ హెడ్‌ని తీసుకురావడంతో అతనిపైనా గైక్వాడ్ విరుచుకుపడ్డారు. కోపం పట్టలేక అతనిపై చెంప దెబ్బ కొట్టారు. ఆ తర్వాత ముఖం మీద కూడా పంచ్‌లతో రెచ్చిపోయారు. వెంటనే ఆ వ్యక్తి కిందపడిపోయాడు.
ఈ సంఘటన తర్వాత గైక్వాడ్ తాను చేసిందేమీ తప్పు కాదని, మాకే వీళ్లు సరైన ఫుడ్ పెట్టకపోతే సామాన్యులకు ఎలా పెడతారని అన్నారు. వారిని కొట్టడంపై విచారించాల్సిన అవసరం లేదని, ఇది శివసేన స్టైల్ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.