MK Stalin: ఎల్లుండే సీఎంగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం

MK Stalin: 10ఏళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారంలోకి వచ్చింది.

Update: 2021-05-05 17:17 GMT

ఎంకే స్టాలిన్‌

MK Stalin: 10ఏళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారంలోకి వచ్చింది. డీఎంకే పార్టీ శాసనసభ పక్షనేతగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్‌ ఎన్నికయ్యాడు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేయాలని గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ స్టాలిన్‌కు ఆహ్వానం పంపించారు. ఈ నేపథ్యంలోనే సీఎంగా తొలిసారి స్టాలిన్‌ ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 7న శుక్రవారం ఉదయం 9 గంటలకు గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌లో స్టాలిన్‌ ప్రమాణం చేయనున్నారు.

స్టాలిన్‌తో పాటు కొంత మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ కన్నా అధిక సీట్లు ఉన్న డీఎంకేను అధికారం చేపట్టాలని గవర్నర్‌ ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

Tags:    

Similar News