Minister Atishi: కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు
Minister Atishi: ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసింది
Minister Atishi: కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు
Minister Atishi: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఆప్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈడీని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకోవడం సరైనది కాదని, దమ్ముంటే తమతో ఎన్నికల క్షేత్రంలో తలపడాలని బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి సవాల్ విసిరారు. ఈడీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం బీజేపీ మానుకోవాలని హితవు పలికారు.
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆమె ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని, కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని ఆప్ మంత్రి అతిషి విమర్శలు చేశారు.