2024 ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. రాత్రి ప్రధాని మోడీ నివాసంలో సీనియర్ నేతల భేటీ
BJP: సమావేశంలో పాల్గొన్న అమిత్‌షా, జేపీ నడ్డా, ఇతర నేతలు
2024 ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. రాత్రి ప్రధాని మోడీ నివాసంలో సీనియర్ నేతల భేటీ
BJP: బీజేపీ అధిష్టానం 2024 ఎన్నికలపై ఫోకస్ పెంచింది. ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది. బుధవారం రాత్రి ప్రధాని మోడీ నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌తో పాటు ఇతర నేతలు హాజరయ్యారు.
ఐదు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ భారీ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.