ఆ అడవిలో అతనొక్కడే ఓటరు.. ఆయన కోసం..

Update: 2019-03-19 03:57 GMT

ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు గురు భరత్ దాస్.. ఈయన గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ అభయారణ్యంలో ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. మనుషులకు దూరంగా ఉన్నా ఫ్యాషన్‌కి మాత్రం దగ్గరగానే ఉన్నాడు. కళ్లకి గాగుల్స్, రోజూ గడ్డానికి ట్రిమ్, తలపై టోపీ, శరీరాన్ని కప్పుకోవడానికి ఓ జాకెట్ ధరించి ఆ అడవిలో ఉన్న శివాలయంలో పూజలు చేసుకుంటూ ప్రకృతితో కాలం గడుపుతున్నారు. ఆయనను చూడటం కోసం పండగలప్పుడే మాత్రమే ప్రజలు వస్తారు. దాంతో అప్పుడే ఆ ప్రాంతంలో జాతర జరుగుతుంది. మిగిలిన సమయాల్లో ఆయన ఒక్కరే అడవిలో జీవనం సాగిస్తుంటారు. అప్పుడప్పుడు ఆయన వద్దకు వచ్చే వ్యక్తులు ద్వారా గురు భరత్ దాస్ ప్రపంచానికి పరిచయమయ్యారు. ఈయన గురించి ఎన్నికల కమీషన్ కు బాగా తెలుసు. ఏ ఎన్నికలు జరిగినా అడవిలో ఆయన కోసం సెపెరేట్ గా పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేస్తుంది ఈసీ. ఈసారి కూడా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో

ఆయన కోసం ప్రత్యేకంగా ఈవీఎం మెషిన్ల, వీవీప్యాట్ యంత్రాలు, మంచినీళ్లు, ఓటర్ల జాబితా ఇలా అన్నింటినీ తీసుకుని వెళతారు. వారికి రక్షణగా పోలీసులను కూడా సిద్ధం చేసింది ఈసీ. వారు ఊరికి దూరంగా ఉన్న అడవిలోకి 35 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. అక్కడ ఆయన ఓటు వేసిన అనంతరం సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. అనంతరం అక్కడినుంచి హెలికాఫ్టర్ ద్వారా ఈవీఎం లను తీసుకువస్తారు. ఇలా రెండు మూడు సార్లు ఎన్నికల కమీషన్ ఆ వ్యక్తికి ఏర్పాట్లు చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసమే ఈ ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల కమీషన్. 

Similar News