Fire Accident: ఢిల్లీ ముఖర్జీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
Fire Accident: బాత్రా సినిమాహాల్ సమీపంలోని గయానా బిల్డింగ్‌లో మంటలు
Fire Accident: ఢిల్లీ ముఖర్జీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
Fire Accident: ఢిల్లీ ముఖర్జీ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాత్రా సినిమా హాల్ సమీపంలోని గయానా బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్‌లో పలు విద్యా సంస్థలకు చెందిన కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అగ్నిప్రమాదంలో పలువురు విద్యార్థులు చిక్కుకున్నారు. అగ్ని ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది విద్యార్థులను కిటికీల్లోనుంచి, తాళ్ల సాయంతో కిందకు తీసుకు వస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దీంతో ముఖర్జీ నగర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు..