Tamil Nadu: తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.108 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Tamil Nadu: 99 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ, కోస్ట్‌గార్డ్
Tamil Nadu: తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.108 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Tamil Nadu: తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డీఆర్ఐ, కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 99 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 108 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. మండపం తీరం నుంచి శ్రీలంకకు అక్రమంగా డ్రగ్స్‌ను తరలించే ప్రయత్నం చేశారు నిందితులు. ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకొని శ్రీలంకలో డెలివరీ చేసేందుకు వెళ్తుండగా డీఆర్ఐ అధికారులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది ట్రాప్ చేసి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని అరెస్ట్ చేశారు.