Hathras Gangrape : అత్యాచారాలపై సుప్రీం మాజీ జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు

హత్రాస్ సామూహిక అత్యాచారం సంఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు ఈ ఘటనపట్ల తీవ్రంగా మండిపడుతున్నాయి..

Update: 2020-10-02 04:28 GMT

హత్రాస్ సామూహిక అత్యాచారం సంఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు ఈ ఘటనపట్ల తీవ్రంగా మండిపడుతున్నాయి.. ఇటువంటి తరుణంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కాండే కట్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు నిరుద్యోగమే కారణమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్ట్ ను పంచుకున్నారు. పురుషులలో సెక్స్ అనేది సహజమైన కోరిక' అని వివరిస్తూ, పురుషులు సాధారణంగా వివాహం ద్వారా ఈ కోరికను తగ్గించుకోగలరని చెప్పారు. ఏదేమైనా, పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా యువకులు వివాహం చేసుకోవడం చాలా కష్టమవుతోందని.. యువతులు నిరుద్యోగులతో వివాహానికి సిద్ధంగా లేరని.. అందువల్ల నిరుద్యోగం వారిని అత్యాచారం వంటి ఘోరమైన నేరాలకు పాల్పడేలా చేస్తోందని అన్నారు.

1947 లో, విభజనకు ముందు, భారతదేశ జనాభా 42 కోట్లు.. అయితే నేడు అది 135 కోట్లకు చేరింది. పెరుగుతున్న జనాభాతో పోలిస్తే ఉపాధి కూడా పెరగాలి.. కానీ అది జరగడం లేదు.. ఒక్క 2020 జూన్‌లో 12 కోట్ల మంది భారతీయులు నిరుద్యోగులుగా మారారని కట్జు అన్నారు. అత్యాచారంపై తాను ఈ వ్యాఖ్యలు చేయడమంటే వాటిని సమర్థించడం కాదని.. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇక నిరుద్యోగం చాలా తక్కువగా ఉండి సామాజిక, ఆర్థిక ప్రగతి ఉన్నట్టయితే దేశంలో ఇలాంటి సంఘటనలు జరగవని కట్జు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే హత్రాస్ లో సెప్టెంబర్ 14 న 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

Tags:    

Similar News