Maoists: ఈనెల 25న బంద్‌కు మావోయిస్టుల పిలుపు

Maoists: ఈనెల 25న మావోయిస్టులు బంద్‌‌కు పిలుపునిచ్చారు.

Update: 2024-04-20 04:45 GMT

Maoists: ఈనెల 25న బంద్‌కు మావోయిస్టుల పిలుపు

Maoists: ఈనెల 25న మావోయిస్టులు బంద్‌‌కు పిలుపునిచ్చారు. నారాయణపూర్, కాంకేర్‌, మోహళ మన్పూర్ ప్రాంతాల్లో బంద్ పాటించాలని కోరారు. చత్తీస్‌గడ్‌ కాంకేర్‌ జిల్లాలోని అపాటోల కల్పర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ బంద్ పాటించాలని మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. కాంకేర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 29మంది మావోయిస్టుల జాబితాను రిలీజ్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్‌ దాడిలో గాయపడి 12మంది మాత్రమే చనిపోయారని... మిగతావారిని చిత్రహింసలకు గురి చేసి పోలీసులు చంపారని మావోయిస్ట్ నార్త్ సబ్ జోనల్ ప్రతినిధి మంగిలి లేఖలో ప్రస్తావించారు.

Tags:    

Similar News