Maoist: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత?

Maoist: ఆర్కే మృతి చెందినట్లు చెబుతున్న బస్తర్ పోలీసులు

Update: 2021-10-14 15:39 GMT

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ కన్నుమూత (ఫైల్ ఇమేజ్)

Maoist: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బీజాపూర్ అడవుల్లో ఆర్కే మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆర్కేకు బుల్లెట్ గాయాలయ్యాయి. మరోవైపు ఏపీ-ఒడిశా బార్డర్ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్కే దివంగత వైఎస్ హయాంలోని ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అటు చంద్రబాబుపై అలిపిరిలో దాడి ఘటనలోనూ ఆర్కే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆర్కేపై 200మంది పోలీసుల ఎన్‌కౌంటర్ కేసులు సైతం ఉన్నాయి.

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా వున్నప్పుడు ప్రభుత్వంతో చర్చల సమయంలో ఆర్కే కీలకంగా వ్యవహరించారు. 2003లో తిరుమల శ్రీవారి బ్రహ్మోహత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన క్లెమోర్‌మైన్ దాడి వెనుక కీలక సూత్రధారిగాఉన్నారు. దీనితో పాటు దేశవ్యాప్తంగా అనేక దాడుల్లో రామకృష్ణ కీలకపాత్ర పోషించారు. ఇదే సమయంలో చాలా సందర్భాల్లో భారీ ఎన్‌కౌంటర్‌ల నుంచి ఆర్కే తృటిలో తప్పించుకునేవారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఆర్కే చనిపోయారు.. లేదంటే బ్రతికే వున్నారంటూ ప్రచారం జరిగేది. అయితే ఆర్కే రెండు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. లంగ్స్ ఇన్ఫెక్షన్ తోపాటు పెరాలసిస్ తో ఆర్కే బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్. నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితుడైన ఆయన ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్కేగా పేరు మార్చుకున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు గత కొంతకాలంగా బస్తర్ అటవీ ప్రాంతంలో ఆర్కే తలదాచకున్నట్లుగా తెలుస్తోంది. 

Tags:    

Similar News