Maoist Bunker Seized: ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం
Maoist Bunker Seized: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Maoist Bunker Seized: ఛత్తీస్‌గఢ్‌లో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం
Maoist Bunker Seized: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మంది మావోలను బలగాలు హత మార్చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టుల సొరంగం బయటపడింది. తాళిపేరు నది సమీపంలో భారీ బంకర్‌ను గుర్తించాయి భద్రతా బలగాలు. సొరంగంలో సకల వసతులు ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు. దేశవాళి రాకెట్ లాంచర్లు తయారు చేసే ఫౌండ్రీ మిషన్, పెద్దఎత్తున మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైర్, ఆయుధాలను గుర్తించారు.
బాంబులను మావోయిస్టులు ఈ సొరంగంలోనే తయారు చేసుకుంటున్నట్టు భద్రతా దళాలు గుర్తించాయి. తుమిరెల్లి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ భారీ సొరంగాన్ని గుర్తించారు. ఈ చర్యతో మావోయిస్టులకు కోలుకోలేని షాక్ తగిలిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా బలగాలు దాడులు చేస్తున్నారు. ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు నక్సలైట్లను భద్రతా బలగాలు చంపేశారు.