Goa Election 2022: పానాజీలో ఉత్పల్‌ పారికర్ నామినేషన్

Goa Election 2022: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉత్పల్

Update: 2022-01-27 06:47 GMT

పానాజీలో ఉత్పల్‌ పారికర్ నామినేషన్

Goa Election 2022: గోవా అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. బీజేపీ అగ్రనేత, దివంగత మనోహార్ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌ పానాజీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఉత్పల్‌కు టికెట్‌ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. అక్కడ సిట్టింగ్‌ బీజేపీ అభ్యర్థికే టికెట్‌ను కేటాయించింది.

ఉత్పల్‌ పారికర్‌ బీజపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తాజాగా తన తండ్రికి సెంటిమెంట్ ప్రాంతమైన పనాజీ నుంచి పోటీ చేస్తున్నట్టు ఉత్పల్‌ పారికర్‌ ప్రకటించారు. తాజాగా ఆయన పనాజీలో నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే ఉత్పల్‌ పారికర్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని శివసేన ప్రకటించింది. మరోవైపు తమ పార్టీలోకి రావాలంటూ ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. అయితే ఉత్పల్‌ పారికర్‌ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగారు.

అయితే బీజేపీలో ఇప్పుడు ఉత్పల్‌ టెన్షన్ మొదలయ్యింది. గోవాలో మనోహర్ పారికర్‌కు మంచి పేరుంది. పనాజీలో ఎలాంటి ఫలితం వస్తుందోనని అక్కడి అధికార పార్టీకి టెన్షన్‌ పట్టుకుంది. 

Tags:    

Similar News