హర్యానాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Update: 2019-10-27 09:28 GMT

హరియానా సీఎంగా బీజేపీ నేత మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య ఆయనతో ప్రమాణం చేయించారు. జేజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్య నిర్వహక అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, అకాలీదళ్‌ చీఫ్‌ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, కాంగ్రెస్‌ నాయకుడు భూపీందర్‌ హూడా హాజరయ్యారు.

Tags:    

Similar News