Mann ki baat : వారి త్యాగాలు ఎంతో గొప్పవి.. మన్‌కీబాత్‌ లో మోడీ!

Mann ki baat : మన్‌కీబాత్‌ లో మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు దేశ ప్రధాని మోడీ.. ఈ కార్యక్రమంలో లద్దాక్‌లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుపెట్టుకుంటుందని మోడీ అన్నారు

Update: 2020-06-28 17:19 GMT

Mann ki bhat : మన్‌కీబాత్‌ లో మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు దేశ ప్రధాని మోడీ.. ఈ కార్యక్రమంలో లద్దాక్‌లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుపెట్టుకుంటుందని మోడీ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలు నుంచి తమ పిల్లలను కూడా దేశ సేవకోసం పంపిచాలని కోరుకుంటున్నామని మోడీ పేర్కొన్నారు. ఆ హింసాత్మక పోరులో బీహార్ నుంచి అమరుడు అయిన కుందన్‌ కుమార్‌ తండ్రి తన ఇద్దరు మనవళ్ళును కూడా సైన్యంలోకి పంపుతాను అన్న విషయాన్నీ మోడీ ఈ కార్యక్రమంలో గుర్తుచేశారు. ప్రతి ఒక్క అమరవీరుడి కుటుంబంలో కూడా ఇదే స్ఫూర్తి నెలకొందని, వారి త్యాగాలు గొప్పవని మోడీ వాఖ్యానించారు. గల్వాన్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు మోడీ తెలిపారు.

ఇక కరోనా గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు 2020 సంవత్సరం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నారని మోడీ అన్నారు. ఎలాంటి సవాళ్ళు ఎదురైనా సరే దేశం పోరాడి ఎదురుకుందని మోడీ అన్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని మోడీ మరోసారి సూచించారు. అంతేకాకుండా సామజీక దూరం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ విషయంలో ఎవరు కూడా నిర్లక్షంగా వ్యవహరించకూడదని, ఆ నిర్లక్ష్యం వల్ల వేరేవాళ్ళ ప్రాణాలను ప్రమాదంలోకి నేట్టివేస్తుందని హెచ్చరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు నుంచి మనం త్వరలోనే బయటపడుతామని, మరింత శక్తిమంతంగా, వేగంగా ముందుకు సాగుతామని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

పీవీ నరసింహారావుని గుర్తుచేసుకున్న మోడీ!

ఇక ఈ కార్యక్రమంలో దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవలను మోడీ గుర్తుచేసుకున్నారు. అయన ఆలోచన విధానం గురించి మోడీ పలు విషయాలను పంచుకున్నారు. పీవీ నరసింహారావుది నేడు వందో జయంతి అన్న సంగతి అందరికి తెలిసిందే..  

Tags:    

Similar News