Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా సీబీఐ విచారణ ప్రారంభం
Delhi Liquor Scam: సుదీర్ఘమైన ప్రశ్నావళితో సిసోడియాను ప్రశ్నిస్తున్న సీబీఐ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా సీబీఐ విచారణ ప్రారంభం
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ విచారణ ప్రారంభమైంది. సుదీర్ఘమైన ప్రశ్నావళితో సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక.. కోర్టు ఆదేశాలతో సిసోడియా విచారణను వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. సిసోడియాను సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో నేటి నుంచి 5 రోజుల పాటు సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిసోడియా. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్, సీబీఐ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.