Viral Video: ఏనుగుతో ఎకసెకలు..నెట్టింట వీడియో వైరల్..
Viral Video: అయితే ఓ వ్యక్తిలో దైవ చింతన ఎక్కువ అయిందో ఏమోగానీ...గజరాజు ముందు వంగి వంగి దండాలు పెట్టాడు..
Viral Video: ఏనుగుతో ఎకసెకలు..నెట్టింట వీడియో వైరల్..
Viral Video: దేవుడు పట్ల భక్తిని చాటుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ప్రతి వ్యక్తి తనకు నచ్చిన విధంగా దేవుడిని ఆరాధించుకోవచ్చు. అలాగే మనుషులతో పాటు అన్ని ప్రాణులు భగవత్ స్వరూపాలే అని హిందువుల ప్రగాఢ విశ్వాసం..అందుకే, ఆవు వంటి సాధు జంతువులనే కాదు విష సర్పాలను క్రూరమృగాలను సైతం దైవ స్వరూపాలు భావించి హిందువులు పూజిస్తుంటారు. అయితే ఓ వ్యక్తిలో దైవ చింతన ఎక్కువ అయిందో ఏమోగానీ...గజరాజు ముందు వంగి వంగి దండాలు పెట్టాడు..
చూశారు కదా ఈ వీడియో సదరు వ్యక్తి ఎలా ఏనుగుకు ఎదురు వెళ్లి నమస్కారాలు చేస్తున్నాడో. ఈ ఘటన ధర్మపురి సమీపంలోని హోగెనక్కల్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇలా దండాలు పెట్టడమే కాకుండా ఎలా విన్యాసాలు చేశాడో చూశారు కదా..గజరాజం మంచి మూడ్ లో ఉంది కాబట్టి సరిపోయింది...లేదంటే మనోడి ప్రవర్తనకు చిర్రెత్తి తొండంతో ఒక్కటి ఇచ్చి ఉండేది..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఏనుగుతో గేమ్స్ ఏంటని పలువురు సదరు వ్యక్తిని నిందిస్తున్నారు. అంతేకాదు ఏనుగును రెచ్చగొడుతున్న ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి, గురుడు మందులో ఉన్నాడని గజరాజానికి కూడా తెలిసిందో ఏమో..మనోడిని మన్నించి వదలిపెట్టేసింది.