Maharashtra Graveyard: శ్మశానంలో కరోనా రోగుల మృతదేహాలను పీక్కుతింటున్న యువకుడు
Maharashtra Graveyard: ఓ యువకుడు మాత్రం ఏకంగా కరోనా రోగుల మృతదేహాలను పీక్కుతింటున్నాడు
Maharastra:(File Image)
Maharashtra Graveyard: కరోనాతో మరణించిన రోగి మృతదేహాన్ని తాకేందుకు కుటుంబ సభ్యులు కూడా వెనకాడుతున్న రోజులివి. అలాంటిది ఒకడు చేసిన పని చూస్తే మనం షాకవుతాం. అసలు అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. కాని వాడు చేసిన వ్యవహారం చూస్తే మన గుండె బద్ధలైపోతుంది. అసలు వినటానికే దారుణంగా ఉందీ ఘటన. కరోనా మృతదేహాల పట్ల జనాల్లో అంతా భయం నెలకొంది. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా కరోనా రోగుల మృతదేహాలను పీక్కుతింటున్నాడు. అది కూడా శ్మశాన వాటికలో సగం కాలిన మృతదేహాలను తింటున్నాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బుధవారం ఉదయం సతారా జిల్లాలోని కోలకి గ్రాయ పంచాయతీ శ్మశాన వాటికలో ఓ మతి స్థిమితం లేని యువకుడు కనిపించాడు. అతడు శ్మశాన వాటికలో తిరుగుతూ సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను తింటున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడి చేరుకునే లోపే అతడు పరారయ్యాడు. ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు సాయంత్రాని కల్లా అతడిని వెతికి పట్టుకున్నారు. అతడు హిందీ మాట్లాడుతున్నాడని.. పేరు, ఊరు వివరాలు చెప్పడం లేదని అధికారులు వివరించారు. మతిస్థిమితం లేకే మృతదేహాలను తిని ఉండవచ్చని చెప్పారు. ఏది ఏమైనా ఇంకా ఎలాంటివి వినాల్సి వస్తోందనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.