Mamata Banerjee: బీజేపీ ఒక "జుమ్లా" పార్టీ
* మోడీ, అమిత్ షా దేశాన్ని తాలిబన్ వైపుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు
మమతా బెనర్జీ (ఫోటో: ది హన్స్ ఇండియా)
Mamata Banerjee: బీజేపీ ఒక "జుమ్లా" పార్టీ అని ఆరోపించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దేశాన్ని తాలిబన్ వైపుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారికి అలాంటి అవకాశం ఎంతమాత్రం ఇవ్వబోమన్నారు మమతా.
దేశాన్ని విభజించాలనే ఆలోచనలు చెల్లవని, దేశ ఐక్యత చెదిరిపోదన్నారు ఆమె. బెంగాల్‌లో దుర్గా పూజకు, లక్ష్మీ పూజకు అనుమతి లేదని అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. గాంధీజీ, నేతాజీ, వివేకానంద, సర్దార్ పటేల్, గురు నానక్, గౌతమ బుద్ధ, జైనులు దేశ ఐక్యతకు ఎంతో చేశారని గుర్తు చేశారు మమతా బెనర్జీ.