Mamata Banerjee: భవానీపూర్ ఉపఎన్నికలో 58,389 ఓట్ల మెజారిటీతో మమత ఘన విజయం
* మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కొనసాగిస్తున్న మమతాబెనర్జీ * భవానీపూర్‌తో పాటు జంగీపుర్, సంషేర్‌గంజ్ ఉపఎన్నికల కౌంటింగ్
Bengal ByPoll Counting:మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కొనసాగిస్తున్న మమతాబెనర్జీ(ఫోటో- ది హన్స్ ఇండియా)
Bengal ByPoll: పశ్చిమ బెంగాల్ భవానీపూర్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై ఘన విజయం సాధించారు. ప్రియాంకపై ఏకంగా 58వేల 389 ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచీ మమత బెనర్జీ ఆధిపత్యం కొనసాగింది. రౌండ్ రౌండుకు దీదీ మెజారిటీ పెరిగి 50 వేలకుపైగా చేరింది. భవానీపూర్ విజయంతో దీదీ ముఖ్యమంత్రి పీఠాన్ని నిలబెట్టుకున్నారు.