Mallikarjun Kharge: బీజేపీ చేతకాని పాలనతోనే చైనాతో సరిహద్దు వివాదం

Mallikarjun Kharge: దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలి

Update: 2022-12-13 13:35 GMT

Mallikarjun Kharge: బీజేపీ చేతకాని పాలనతోనే చైనాతో సరిహద్దు వివాదం

Mallikarjun Kharge: మోడీ చేతకాని తనం వల్లే చైనా భారత్ సరిహద్దుల్లో గొడవలు జరుగుతున్నాయని ఆరోపంచారు AICC అధ్యక్షులు మళ్లికార్జున ఖర్గే. ఓవైపు దేశ భూబాగాన్ని చైనా సైనికులు ఆక్రమించుకుంటున్నప్పటికీ ఆవిషయంపై చర్చిద్దామంటే ఒక్క సమాధానంతో సరిపెట్టుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో ప్రతిపక్షాలుగా తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిపోయి.. డిఫెన్స్ మినిష్టర్ సభనుంచి వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం సమాధానం చెప్పలేకే మొఖం చాటేసిందని ఫైర్ అయ్యారు. సభలో కేంద్రం అనుసరించి తీరుతోనే తాము ప్రతిపక్షాలతో కలిసి వాకౌట్ చేశామని తెలిపారు. ఈవిషయంపై సుధీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఖర్గే.

Tags:    

Similar News