Sabarimala: పొన్నాంబలమేడు కొండపై నుంచి మకరజ్యోతి దివ్య దర్శనం.. భక్తులతో కిక్కిరిసిన శబరిమల
Sabarimala: అయ్యప్పస్వాముల శరణుఘోషతో మార్మోగుతున్న శబరిగిరులు
Sabarimala: పొన్నాంబలమేడు కొండపై నుంచి మకరజ్యోతి దివ్య దర్శనం.. భక్తులతో కిక్కిరిసిన శబరిమల
Sabarimala: శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేసింది. భక్తులకు మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకరజ్యోతి దివ్య దర్శనం జరిగింది. జ్యోతి దర్శనం కోసం అక్కడికి చేరుకున్న లక్షలాది మంది అయ్యప్పస్వాముల అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి. అరుదైన దృశ్యాన్ని చూసి స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో ఉప్పొంగిపోయారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణుఘోషతో శబరిగిరులు మారుమోగుతుండగా.. మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు.