Chhattisgarh: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. దంతెవాడలో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు

71 Maoists Surrender in Dantewada: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2025-09-24 09:55 GMT

71 Maoists Surrender in Dantewada: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్‌కౌంటర్లతో పాటు మావోయిస్ట్ పార్టీలో చీలికలు, విభేధాల కారణంగా అనేకమంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఉద్యమాన్ని వీడుతున్నారు. ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు దంతెవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

దీంతో నక్సల్ ఉద్యమానికి ఇది పరాజయంగా మారింది. ఇక లొంగిపోయిన 71 మంది మావోయిస్టుల్లో 30 మంది సభ్యులపై 6.4 మిలియన్ల రివార్డులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరంతా గతంలో అనేక ప్రభుత్వ వ్యతిరేక విధ్వంసక సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు తెలిపారు.

Similar News