Major Setback for Maoists: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. ఒడిశాలో 22 మంది నక్సల్స్ లొంగుబాటు
Major Setback for Maoists: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఒడిస్సా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా పోలీసుల ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Major Setback for Maoists: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఒడిస్సా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా పోలీసుల ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి 9 తుపాకులు, 14 టిన్ బాంబులు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు జోనల్ కమిటీ సభ్యులు ఉండగా.. మరో 20 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నారు.
వీరిలో మావోయిస్టు నాయకుడు డీసీఎం లింగే కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అరణ్యంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని డీజీపీ ఖురానియా పిలుపునిచ్చారు. మావోయిస్టులు లొంగిపోయి హింసా మార్గాన్ని విడిచిపెడితే, వారికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని డీజీపీ ఖురానియా తెలిపారు.