SpiceJet: స్పైస్‌జెట్‌ విమానానికి తప్పిన పెను ప్రమాదం

SpiceJet: స్పైస్‌జెట్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్లలో ఒకదానిలో సాంకేతిక సమస్య తలెత్తింది.

Update: 2025-11-10 08:57 GMT

SpiceJet: స్పైస్‌జెట్‌ విమానానికి తప్పిన పెను ప్రమాదం

SpiceJet: స్పైస్‌జెట్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్లలో ఒకదానిలో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే గుర్తించి పైలట్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. స్పైస్‌జెట్ సంస్థకు చెందిన SG 670 విమానం ముంబై నుంచి కోల్‌కతా బయల్దేరింది.

మరికాసేపట్లో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుందనగా విమానంలోని ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. పైలట్ నుంచి సమాచారం అందగానే ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అప్రమత్తమై ఎమర్జెన్సీ ప్రకటించారు. 

Tags:    

Similar News