మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం : కరోనా అనుమానితుల చేతిపై స్టాంప్

ఇక భారత్ లోని మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా ఇక్కడ దుబాయ్ వెళ్లొచ్చిన ఒకతను ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Update: 2020-03-17 10:55 GMT
Maharashtra Stamps Left Hand Of Those In Home Quarantine

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు దాదాపుగా 140 పైగా దేశాలకి సోకి 6500 మంది పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఇక భారత్ లో నలుగురు చనిపోగా, మరికొంత మందికి చికిత్స జరుగుతుంది. ఇక ఈ వ్యాధిని అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చాయి. అంతేకాకుండా సినిమా ధియేటర్స్, షాపింగ్ మాల్స్ పబ్బులను ఈ నెల చివరివరకు మూసివేశాయి.

ఇక భారత్ లోని మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా ఇక్కడ దుబాయ్ వెళ్లొచ్చిన ఒకతను ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపద్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. "ముంబైలో హోం క్వారంటైన్డ్‌ లో ఉంటున్న కరోనా అనుమానితుల చేతులపై స్టాంపులు వేస్తున్నారు. చతురస్రాకారంలో ఉన్న ఆ స్టాంప్‌ను అనుమానితుల ఎడమ చేతులకు వెనుక వైపు వేస్తారు. ఆ స్టాంప్‌లో 'నేను ప్రజలను రక్షించేందుకు ఇంట్లోనే ఉంటానని చెప్పేందుకు గర్వపడుతున్నాను' అని రాసి ఉంది. అంతేకాకుండా మార్చి 30 వరకు ఇళ్లలోనే ఉండాలిని రాసి ఉంది. ఒకవేళ దీనిని ఎవరైనా ఉపక్రమిస్తే అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.

షిర్డీ ఆలయంతో పాటు పలు ఆలయాలు మూసివేత : 

ఇక మరోపక్కా మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని కూడా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆలయాన్ని ట్రస్ట్‌ అధికారులు మూసివేయనున్నారు. భక్తులు షిర్డీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో జన సమూహాలను నివారించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా షిర్డీ ఆలయంతో పాటు మహారాష్ట్రలోని పలు ఆలయాలు మూతపడ్డాయి.

Tags:    

Similar News