Swiggy Platform Fee : ఫుడ్ లవర్స్‌కు స్విగ్గీ షాక్.. భారీగా పెరిగిన ప్లాట్‌ఫారమ్ ఫీజు!
Swiggy Platform Fee : ఫుడ్ లవర్స్‌కు షాక్! స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజులను భారీగా పెంచాయి. తాజా పెంపుతో ప్రతి ఆర్డర్‌పై మీరు ఎంత అదనంగా చెల్లించాలో, ఈ ధరల పెంపునకు గల కారణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.
Swiggy Platform Fee : ఫుడ్ లవర్స్‌కు స్విగ్గీ షాక్.. భారీగా పెరిగిన ప్లాట్‌ఫారమ్ ఫీజు!
Swiggy Platform Fee : మీరు తరచుగా స్విగ్గీ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఇకపై మీరు ప్రతి ఆర్డర్‌పై అదనపు భారాన్ని మోయక తప్పదు. ప్లాట్‌ఫారమ్ నిర్వహణ ఖర్చులను సాకుగా చూపుతూ స్విగ్గీ తాజాగా తన ఫీజును ఏకంగా 17 శాతం మేర పెంచింది. ఇప్పటి వరకు స్విగ్గీ ప్రతి ఆర్డర్‌పై రూ.14.99 ప్లాట్‌ఫారమ్ ఫీజును వసూలు చేసేది. తాజా పెంపుతో ఇది ఇప్పుడు రూ.17.58కి చేరింది. గతేడాది సెప్టెంబర్‌లో కూడా కంపెనీ ఈ ఫీజును 20 శాతం పెంచి రూ.14.99 చేసిన సంగతి తెలిసిందే. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మళ్లీ ధరలు పెంచడం గమనార్హం.
జొమాటో కూడా అదే బాటలో..
స్విగ్గీ కంటే ముందే జొమాటో కూడా తన ప్లాట్‌ఫారమ్ ఫీజును పెంచింది. గతంలో రూ.12.50 గా ఉన్న ఫీజును జొమాటో రూ.14.90కి పెంచింది. అయితే, దీనికి జీఎస్టీ (GST) అదనంగా తోడవ్వడంతో, రెండు ప్లాట్‌ఫారమ్‌లలోనూ వినియోగదారుడు దాదాపు రూ.17.58 వరకు అదనపు ఫీజు చెల్లించాల్సి వస్తోంది.
ఎందుకీ పెంపు అంటే..
ద్రవ్యోల్బణం పెరగడం, రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మార్జిన్లపై ఒత్తిడి ఉండటంతో, కంపెనీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్లాట్‌ఫారమ్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, యూజర్స్‌కు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఫీజు పెంపు తప్పనిసరి అని స్విగ్గీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కానీ, సామాన్య వినియోగదారుడికి మాత్రం ఇది అదనపు భారంగా మారిందనే కామెంట్స్ యూజర్స్ నుంచి వస్తున్నాయి. ఒక్కో ఆర్డర్‌పై ఈ మొత్తం తక్కువగా అనిపించినప్పటికీ, నెలకు పదుల సంఖ్యలో ఆర్డర్లు చేసే వారికి ఇది పెద్ద మొత్తంగా మారుతోందని చెబుతున్నారు.