Heavy Rains: మహారాష్ట్రలో దంచికొడుతున్న భారీ వర్షాలు.. వర్షాల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి

Heavy Rains: గత మూడు రోజులుగా మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Update: 2025-09-30 04:27 GMT

Heavy Rains: గత మూడు రోజులుగా మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ముంబైతో పాటు థాణె, మరఠ్వాడా ప్రాంతాల్లో కుండపోత వానలు అతలాకుతలం సృష్టించాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

భారీ వర్షాల వల్ల జలమయమైన లోతట్టు ప్రాంతాల నుంచి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. సుమారు 41,000 మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. తలసారి ప్రాంతంలో అత్యధికంగా 208 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలతో నగరాల్లో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు జలమయం కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నాయి.

Tags:    

Similar News