సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఉద్ధవ్‌ థాక్రే

*సీఎం పదవికి రాజీనామాకు సిద్ధపడ్డ ఉద్ధవ్ థాక్రే

Update: 2022-06-23 00:59 GMT

క్షణక్షణానికి మారుతున్న మహా రాజకీయాలు

Maharashtra Political Crisis Updates: మహారాష్ట్రలో క్షణక్షణానికి మలుపుతిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కల్గిస్తున్నాయి. శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం తిరుగుబావుటతో సీఎం ఉద్ధవ్ థాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడి కూటమి కూలిపోయే దశకు చేరుకున్నది. మరో వైపు సీఎం ఉధ్దవ్ థాక్రే అధికారిక నివాసం ఖాళీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ముంబై సబర్బన్ బాంద్రాలోని సోంత నివాసం మాతోశ్రీకి మకాం మార్చారు. ఆఫీస్ నుంచి సామాగ్రిని సిబ్బంది ప్యాక్ చేసి తీసుకు వెళ్లారు. తన కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఉద్ధవ్ థాక్రేతో కలిసి ఒకే కారులో వెళ్లారు.

తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలపై మౌనం వీడిన ఉద్ధవ్ థాక్రే తాను సీఎం కుర్చీ కోసం ఏనాడు పాకులాడలేదని శివ సైనికుల అభిప్రాయాలే తనకు ముఖ్యమన్న థాక్రే ఒక్క ఎమ్మెల్యే తనను వ్యతిరేకించినా రాజీనామా చేస్తానన్నారు. రాజీనామా లేఖ కూడా కార్యాలయంలో సిద్ధంగా ఉందని రెబల్ ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే తీసుకుని గవర్నర్ కు ఇవ్వవొచ్చని తెలిపారు. అవసరమైతే పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తాననిఒక శివ సైనికుడు సీఎం అయితే సంతోశిస్తానని థాక్రే చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకు వచ్చని సూచించారు. తన వైపు ఎంత మంది ఉన్నారో ఎంత మంది లేరనేది పక్కన పెడితే తనకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడదని థాక్రే ధీమా వ్యక్తం చేశారు. హిందుత్వం అనేది శివసేన సిద్ధాంతమని, హిందుత్వాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని అన్నారు. హిందుత్వ అజెండాతోనే శివసేన ఏర్పాటైందన్న ఆయన దానికి కట్టుబడి ఉన్నామన్నారు. 

Tags:    

Similar News