లాక్‌డౌన్‌ : మహారాష్ట్ర కీలక నిర్ణయం

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

Update: 2020-05-15 06:07 GMT
Uddhav Thackeray(File photo)

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ముంబై, పూణే, మాలెగావ్, ఔరంగాబాద్, సోలాపూర్ వంటి హాట్‌స్పాట్ లలో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో లాక్డౌన్ విస్తరించే అవకాశంపై చర్చించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, జల వనరుల శాఖ మంత్రి జయంత్ పాటిల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే, పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్, రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్ తోరత్, పిడబ్ల్యుడి మంత్రి అశోక్ చవాన్ పాల్గొన్నారు.

కాగా లాక్డౌన్ 3.0 మే 17 తో ముగిసేలోపు కేంద్రం యొక్క మార్గదర్శకాలు ప్రకటించబడతాయి" అని ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారి వార్తా సంస్థ పిటిఐ తో అన్నారు. ఇదిలావుంటే శుక్రవారం నాటికి, మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు 27,500 గా ఉన్నాయి. ముంబైలో వైరస్ కారణంగా ఇప్పటివరకు 975 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇక్కడ మొత్తం 15,747 కేసులు ఉండగా.. 596 మంది మరణించారు.

Tags:    

Similar News