క్లైమాక్స్‌కు చేరిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం

*స్పీకర్‌గా బిజెపి ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ విజయం

Update: 2022-07-03 07:36 GMT

క్లైమాక్స్‌కు చేరిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం క్లైయిమాక్స్‌కు చేరింది. శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్పీకర్‌ పదవికి ఎన్నిక పూర్తయింది. హెడ్‌ కౌంట్ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. బిజెపి ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ 57ఓట్ల మెజార్టీతో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. నర్వేకర్‌కు మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది.

మహా వికాస్‌ అఘాడీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే రాజన్‌ సాల్వికి 107 ఓట్లు దక్కాయి. కొత్తగా సీఎం పదవి చేపట్టిన ఏక్‌నాథ్‌ షండే సర్కార్‌ రేపు బలపరీక్ష ఎదుర్కోనుంది. దీనికి ముందు స్పీకర్‌ ఎన్నిక జరగడంతో షిండేకు ఉన్న మద్దతు ఎంతో ఒకరోజు ముందే తెలిసిపోయింది. రేపు జరిగే విశ్వాస పరీక్షలోనూ షిండేవిజయం ఖాయమని తేలిపోయింది.

Tags:    

Similar News