యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో శనివారం 51 కొత్త కరోనా కేసులు వచ్చాయి.

Update: 2020-06-13 08:30 GMT

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో శనివారం 51 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కునాల్ చౌదరి కూడా ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన తనను తాను నిర్బంధించుకున్నారు. ఆయనతో భేటీ అయిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఆయనకు కూడా పెద్దగా లక్షణాలు లేకుండానే కరోనా బయటపడింది. ఇక భోపాల్ లో కొత్తగా సోకిన వారిలో 4 మరియు 8 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదే సమయంలో, ఇసార్ దిగ్బంధం కేంద్రం భూరానీలో 11 మంది అనుమానితుల నివేదికలు పాజిటివ్ గా వచ్చాయి. అంతకుముందు అక్కడ 9 మందికి కరోనా సోకింది.

ఎయిమ్స్‌లో ఒక రోగికి కూడా కరోనా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పిప్లానీ, షాజహానాబాద్, ఐష్బాగ్, జహంగీరాబాద్ ప్రాంతాలలో కూడా కరోనా ఇన్ఫెక్షన్లు కనుగొనబడ్డాయి. చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జారీ చేసిన బులెటిన్ ప్రకారం, గత 24 గంటల్లో 1964 నమూనాలను పరీక్షించగా 51 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో, కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 2144 కు పెరిగింది. వీరిలో 69 మంది మరణించారు. 1454 మంది కోలుకొని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News