లాక్ డౌన్ పొడిగింపు దిశగా మధ్యప్రదేశ్

ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిని వణికిస్తుంది కరోనా.. దీనిని అరికట్టడానికి ప్రపంచదేశాలు అన్ని లాక్ డౌన్ ని ప్రకటించాయి.

Update: 2020-05-30 14:09 GMT
Sivaraj Singh Chouhan (File Photo)

ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిని వణికిస్తుంది కరోనా.. దీనిని అరికట్టడానికి ప్రపంచదేశాలు అన్ని లాక్ డౌన్ ని ప్రకటించాయి. ఇక భారత్ లో కూడా లాక్ డౌన్ ప్రకటించడం, పొడిగించడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం మార్చ్ 24 నుండి ఏప్రిల్ 14 వరకు మొదటి విడత లాక్ డౌన్ డౌన్ ప్రకటించింది. తరువాత ఏప్రిల్ 15 నుండి మే 3 వరకు రెండొవ విడత లాక్ డౌన్ ప్రకటించింది.

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మరోసారి అంటే మే 3 నుండి మే 17 వరకు మూడవ విడత లాక్ డౌన్ అమలయ్యింది.. అయితే కొన్ని సడలింపులు ఐతే ఇచ్చింది. తరువాత మరోసారి మే 17 నుండి మే 31 వరకు మరోసారి నాల్గోవ విడత లాక్ డౌన్ ప్రకటించింది. అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.. కొన్ని రాష్ట్రాలు స్వచ్చందంగానే కేంద్ర లాక్ డౌన్ ప్రకటించే ముందే లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణియించుకున్నాయి.

కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అంటే జూన్ 15 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ తెలిపారు. రేపటితో దేశవ్యాప్త లాక్ డౌన్ ముగుసుతున్న తరుణంలో తాన నిర్ణయంన్ని ప్రకటించారు. 


Tags:    

Similar News