Lunar Eclipse: సంపూర్ణ చంద్రగ్రహణం..భార‌త్‌లో ఏ టైమ్‌లో వస్తుంది?

Lunar Eclipse: ఈ ఏడాది మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం నేడు రాబోతోంది.

Update: 2021-05-25 03:39 GMT

 చంద్రగ్రహణం పాత చిత్రం 

Lunar Eclipse: ఈ ఏడాది మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం నేడు రాబోతోంది. ఈ గ్రహణం భారత్‌లో మధ్యామ్నం 3.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.22 గంటలకు ముగుస్తుంది. సంపూర్ణ గ్రహణం 14 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంటుంది. సాయంత్రం 6.23కి చంద్రగ్రహణం పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ చందమామ కనిపిస్తుంది ఇలాంటి చంద్ర గ్రహణాన్ని దాదాపు పదేళ్ల కిందట 2011 డిసెంబరు 10న కనువిందుచేసింది. ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ (ఎర్ర చందమామ) అంటున్నారు. చంద్రగ్రహణం సమయంలో చందమామ ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తుంది. ఇలాంటిది 2019 జనవరి 21న వచ్చింది. మళ్లీ ఇప్పుడే వస్తోంది.

సూర్యకిరణాల్లోని ఎరుపు, నారింజ రంగు కిరణాలు భూమి నుంచి ముందుకు దూసుకెళ్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే సూర్యుడికీ చందమామకూ మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకిరణాలు చంద్రుడిపై పడవు. ఆ సమయంలోగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ దాదాపు 14 నిమిషాల పాటు సంపూర్ణంగా దర్శనమివ్వనుంది. చందమామపై ప్రసరిస్తాయి. అందువల్ల చందమామ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం.

సూప‌ర్ బ్ల‌డ్‌మూన్‌

చంద్రుడు సూపర్‌ బ్లడ్‌ మూన్‌గా క‌నిపించ‌నున్నాడు. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వస్తాయి. సూర్యుడు, చంద్రుడికి మధ్యకు భూమి వచ్చి భూమి నీడ చంద్రునిపై పడటాన్ని చంద్రగ్రహణం అంటారు. భూమి నీడపడినప్పుడు కాంతి తరంగాలు ఫిల్టర్‌ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపిస్తాడు. చంద్రగ్రహణం సమయంలో మే 26న సాయంత్రం అరుదైన సూపర్‌ బ్లడ్‌ మూన్‌ ఆవిష్కృతం కానుంది.

రాశులపై చంద్రగ్రహణ ప్రభావం:

12 రాశులపై చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. చందమామ వల్ల వివిధ రాశుల వారికి మానసిక ఆనందం కలుగుతుంది. అదే చందమామకు గ్రహణం పడితే ఆ రాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇండియాలో గ్ర‌హ‌నం పెద్ద‌గా క‌నిపించ‌దు కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.

Tags:    

Similar News