భారీగా పెరిగిన వంటగ్యాస్‌ ధర.. 2014 జనవరి తర్వాత ఇంత ఎక్కువ పెరగడం ఇదే తొలిసారి

Update: 2020-02-12 09:42 GMT

వంటగ్యాస్‌ ధర భారీగా పెరిగింది. దీంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. 144. 5 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరతో 858.5కి చేరింది సిలిండర్‌ ధర. ప్రభుత్వం వినియోగదారులకు ఇచ్చే రాయితీ మొత్తం 153.86 రూపాయల నుంచి 291.48 రూపాయలు పెరగనుంది. సిలిండర్‌ ధర పెంపుతో వినియోగదారుడిపై అదనంగా 7 రూపాయల భారం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరలు పెరగడంతోనే భారత్‌లో కూడా ధరలు పెరిగినట్లు సమాచారం. 2014 జనవరి తర్వాత ఇంత ఎక్కువగా పెరగడం ఇదే తొలిసారి.

Tags:    

Similar News