Lok Sabha Meeting: ప్రారంభమైన లోక్‌సభ బీఏసీ సమావేశం
Lok Sabha Meeting: 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం
Lok Sabha Meeting: ప్రారంభమైన లోక్‌సభ బీఏసీ సమావేశం
Lok Sabha Meeting: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జరుగుతున్న బీఏసీ సమావేశానికి వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చి్స్తున్నారు. ఈ సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఏయే బిల్లుకు ఎంత సమయం కేటాయించాలన్న దానిపై.. బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లోనే ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్‌పై బిల్లు ప్రవేశపెట్టనుంది కేంద్రం.