Parliament: లోక్‌సభలో గందరగళం.. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
Parliament: సభ సజావుగా సాగేందుకు సహకరించాలి
Parliament: లోక్‌సభలో గందరగళం.. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
Parliament: కలర్ స్మోక్ ఘటనపై పార్లమెంట్‌లో చర్చించాలని విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. భద్రతా వైఫల్యంపై సభలో చర్చించాలని... హోంమంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీ ప్రతాప సింహాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విపక్షాల నిరసనతో లోక్‌సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదంటూ స్పీకర్ సూచించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరారు. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.