తమిళనాడులో మే31 వరకు లాక్ డౌన్ పొడిగింపు

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో తమిళనాడు సర్కార్ మే31 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది.

Update: 2020-05-17 12:33 GMT

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో తమిళనాడు సర్కార్ మే31 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది.. ఈ మేర‌కు నూత‌న ఆదేశాలు జారీచేసింది. మే 31 వ‌ర‌కు స్కూళ్లు, కాలేజీలు, ఇత‌ర రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు మూసి ఉంటాయ‌ని.. ఆల‌యాలు, మ‌సీదులు, చ‌ర్చిలు కూడా తెరుచుకోవని ప్ర‌భుత్వం అందులో పేర్కొంది.. విమానాలు, రైళ్లు, బ‌స్సులు నడవవని,పెళ్లి కార్యాలయాలపై కూడా నిషేధం ప్రకటిస్తున్నట్టుగా వెల్లడించింది. తమిళనాడులో కరోనా కేసులు పదివేల మార్కును దాటాయి..

ఇక అటు కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ మే31వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. దీనితో రేపటి నుంచి దేశవ్యాప్తంగా మరో 14 రోజులపాటు లాక్ డౌన్ నడవనుంది. కేంద్రం లాక్ డౌన్ ని పొడిగించడం ఇది మూడో సారి కావడం గమనార్హం..ఇక సాయింత్రం కొత్త మార్గదర్శకాలను కేంద్రం రిలీజ్ చేయనుంది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 90,648 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఇందులో 2,871 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని 34,224 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 3,970 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వ్యాధి కారణంగా 103 మంది చనిపోయారు. 

Tags:    

Similar News