దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్ 5.0లో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.
* కర్ఫ్యూ రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ ..
* జూన్ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి.
* జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతి.
* విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం
* విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇవ్వనుంది.
* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారం
* మెట్రో రైలు సేవలకు ఇంకా అనుమతి లేదు
* సినిమాహాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, పార్కులు, బార్లకు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు
* అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు
*అంతర్రాష్ట్ర రవాణాపై కేంద్ర హోంశాఖ నిషేధం ఎత్తివేత
*రవాణా అనుమతించే విషయం రాష్ట్రాలదే నిర్ణయం
* తెలుగు రాష్ట్రాల రవాణాకు ఆయా ప్రభుత్వాలదే నిర్ణయం