ఆటోలు, క్యాబ్స్‌, బస్సులకు సీఎం గ్రీన్ సిగ్నల్

Update: 2020-05-18 12:30 GMT

దేశ రాజధాని ఢిల్లీ లో లాక్ డౌన్ నిబంధనలు విడుదల చేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్. లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాల గురించి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాకు వివరించారు. 

ఢిల్లీ లో ఆటో, ప్రైవేటు క్యాబ్ లకు అనుమతి.

ఆటోలో ఒకరు, క్యాబ్ లో ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి.

బస్సులలో కేవలం 20 మందికి మాత్రమే అనుమతి.

రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ

ప్రభుత్వ , ప్రైవేట్ కార్యాలయాలు తెరవడానికి అనుమతి.

వివాహాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి .

కంటైన్మ్ంట్ జోన్ లలో ఎటువంటి కార్యకలాపాలకు అనుమతి లేదు.

భవన నిర్మాణాలు, ఇతర నిర్మాణాల కార్యకలాపాలకు అనుమతి.

ద్విచక్ర వాహనదారులకు అనుమతి , కాని కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించాలి.

అయితే మెట్రోలు, మాల్సా్‌, థియేటర్లను తెరిచేందుకు అనుమతించబోమని చెప్పారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మహమ్మారి బారినపడకుండా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శాలను అనుసరించాలని కోరారు. 

Tags:    

Similar News