ఉదయ్‌పూర్ చింతన్ శివిర్‌లో సోనియాగాంధీకి నేతల ట్విస్ట్
Congress Chintan Shivir: సాయంత్రం అవ్వగానే స్వరం మార్చిన హస్తం పార్టీ నేతలు
ఉదయ్‌పూర్ చింతన్ శివిర్‌లో సోనియాగాంధీకి నేతల ట్విస్ట్
Congress Chintan Shivir: ఉదయ్‌పూర్ చింతన్ శివిర్‌లో సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ ఇచ్చారు. సడన్ గా పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలని కొత్త స్వరాన్ని వినిపించారు. ఉదయం రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగించాలని చెప్పిన నేతలే సాయంత్రం మాట మార్చి ప్రియాంక గాంధీని నియమించాలంటూ పట్టుబట్టారు.
దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కంగుతింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక అక్కడే ఉన్నప్పటికీ సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా తెర మీదకు ప్రియాంక గాంధీ పేరు రావడంతో హైకమాండ్‌కి కొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది.