Nirbhaya Case: తొలికేసులోనే అద్భుత విజయం : సీమా సమృద్ధిపై నెటిజన్లు ప్రశంసలు

సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకి ఈ రోజు ఉరి పడిన విషయం తెలిసిందే..ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలు నెంబర్ 3లో ఈ నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు.

Update: 2020-03-20 06:41 GMT
Seema Samriddhi

సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకి ఈ రోజు ఉరి పడిన విషయం తెలిసిందే..ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలు నెంబర్ 3లో ఈ నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు.నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్ష పడటం కూడా దేశంలో ఇదే మొదటిసారి.. గత ఎనమిదెళ్ళ నుంచి నుండి ఇప్పటివరకూ నిర్భయ కేసులో నిందితులు ఉరి నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ న్యాయమే గెలిచింది.

అయితే ఈ కేసులో నిర్భయ తల్లి ఆశాదేవితో పాటు ఆమె తరుపు లాయర్ సీమ సమృద్ధి కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించారు. ఇదే కేసు అమెకి తోలిది కావడం విశేషం.. నిర్భయ కేసును సవాల్ గా తీసుకుని ఆమె దోషుల తరుపు లాయర్లు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. తన వాదనలతో న్యాయమూర్తులను మెప్పించి నలుగురు నిందితులను ఉరికంబం ఎక్కించేలా చేసింది. దీనితో నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక దోషులను కాపాడడానికి చివరి వరకు ప్రయత్నం చేసిన మరో న్యాయవాది ఏపీ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నిందితులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవీ, భద్రినాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తన కుమార్తెకు న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయం వైపే కోర్టులు నిలబడ్డాయని, ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాలని న్యాయపోరాటం చేస్తానని నిర్భయ తల్లి వెల్లడించారు. . ఇక నుంచి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది తండ్రి భద్రినాథ్ సింగ్ వెల్లడించారు.  

Tags:    

Similar News