Land Slide at Jammu Srinagar High Way: జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిలో విరిగిపడ్డ కొండచరియలు

Land Slide at Jammu Srinagar High Way: భారీ వర్షాల కారణంగా గురువారం రాంబన్ జిల్లాలోని జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారి పై కొండచరియలు.

Update: 2020-08-20 10:42 GMT
Land Slide at Jammu Srinagar High Way

Land Slide at Jammu Srinagar High Way: భారీ వర్షాల కారణంగా గురువారం రాంబన్ జిల్లాలోని జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారి పై కొండచరియలు విరిగిపడటంతో రవాణా స్తంబించింది. సుమారు 200 లకు పైగా వాహనాలు చిక్కుకుపోయాయని అధికారులు తెలిపారు.

కాశ్మీర్‌ను దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే ఏకైక ఆల్-వెదర్ రహదారి అయిన 270 కిలోమీటర్ల రహదారి త్రిశూల్ మోర్, బ్యాటరీ చెష్మా, పాంటియాల్ ప్రాంతాలలోనే ఈ కొండచరియలు విరిగిపడ్డాయని.. ప్రధాన రహదారి కావటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు.

వాటి ఫలితంగా, 200 కి పైగా వాహనాలు హైవేలోని వివిధ పాయింట్ల వద్ద చిక్కుకున్నాయని వారు తెలిపారు. ఈ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, మరియు సిబ్బంది అక్కడికి చేరుకొని విరిగిపడ్డ కొండచరియలను తొలగించారు. రాంబన్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడటంతో గత వారం రెండు రోజులు హైవే మూసివేయబడింది అని అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News