13 ఏళ్ల క్రితం నమోదైన కేసులో లాలూకు ఊరట

*లాలూను నిర్దోషిగా నిర్దారిస్తూ తీర్పునిచ్చిన జార్ఖండ్‌లోని పాలము కోర్టు

Update: 2022-06-09 10:53 GMT

13 ఏళ్ల క్రితం నమోదైన కేసులో లాలూకు ఊరట

Lalu Prasad Yadav: ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఊరట లభించింది. 13 ఏళ్ల నాటి కేసు విచారణ నిమిత్తం జార్ఖండ్‌లోని పాలము కోర్టుకు లాలూ హాజరయ్యారు. ఈ కేసును విచారణ జరిపిన న్యాయస్థానం లాలూ నిర్దోషని తీర్పునిచ్చింది. అయితే 6వేల రూపాయల జరిమానా విధించింది. దీంతో ఈ కేసులో లాలూకు విముక్తి లభించినట్లయ్యింది. ఇకపై లాలూ కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది ధీరేంద్ర కుమార్‌ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఏడాదిన్నర జైలు శిక్షణు లాలూ అనుభవించారు.

2009 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలము జిల్లాలోని గర్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున గిరినాథ్ సింగ్ బరిలో నిలిచారు. అతడి తరఫున ప్రచారం చేసేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ హెలికాప్టర్‌లో గర్వా చేరారు. అయితే హెలికాప్టర్‌ను దింపేందుకు గర్వా బ్లాక్‌లోని కల్యాణ్‌పూర్‌లో హెలీప్యాడ్‌ను నిర్మించారు. దీనికి అధికారులు కూడా అనుమతించారు. అయితే అక్కడ దిగకుండా గోవింద్‌ హైస్కూల్‌ మైదానంలోని సభా స్థలిలో హైలికాప్టర్‌ను దింపారు. హఠాత్తుగా మైదానంలోకి హెలికాప్టర్‌ రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఈ ఘటన విషయమై లాలూపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది.

Tags:    

Similar News