Swatmanandendra Swamy: శారదా పీఠం చరిత్రలో మరువరాని ఘట్టం.. విజయవంతంగా లక్ష చండీ యజ్ఞం
Swatmanandendra Swamy: హిందూ ధర్మం కోసం శారదాపీఠం పనిచేస్తుంది
Swatmanandendra Swamy: శారదా పీఠం చరిత్రలో మరువరాని ఘట్టం.. విజయవంతంగా లక్ష చండీ యజ్ఞం
Swatmanandendra Swamy: కురుక్షేత్రలో లక్ష చండీ మహా యజ్ఞం ఘనంగా జరిగింది. గుంతి ఆశ్రమ ఆధ్వర్యంలో జరిగిన ఈ యజ్ఞంలో దేశవ్యాప్తంగా పలువురు పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శరదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ఢిల్లీలో శారదాపీఠం కార్యకలాపాలు విస్తారిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ సహకారం అందిస్తుందని భావిస్తున్నామన్నారు. శరదా పీఠం ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకదన్నారు. అధికారం కోసం యాగాలు చేయడం శారదాపీఠంలో జరగదన్నారు. శరదా పీఠానికి రాజకీయ పార్టీతో సంబంధం ఉందనే అపవాదు వేశారని.. మంచి ఎటు వైపు ఉంటుందో శారదాపీఠం కూడా అటు వైపే ఉంటుందని తెలిపారు. హిందూ ధర్మం కోసం పనిచేస్తామని.. హింధూ ధర్మాన్ని వ్యాప్తి చేయడమే తమ విధానమన్నారు.