లడఖ్‌లో ఉద్రిక్తతలు: రాష్ట్ర హోదా కోసం నిరసనలు

లడఖ్ రాజధాని లేహ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. లడఖ్‌కు రాష్ట్ర హోదా మరియు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్లతో విద్యార్థులు భారీగా ఆందోళనలు చేపట్టారు.

Update: 2025-09-24 08:45 GMT

లడఖ్‌లో ఉద్రిక్తతలు: రాష్ట్ర హోదా కోసం నిరసనలు

లడఖ్ రాజధాని లేహ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. లడఖ్‌కు రాష్ట్ర హోదా మరియు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్లతో విద్యార్థులు భారీగా ఆందోళనలు చేపట్టారు.

ఈ ఆందోళనలకు కారణం, గత 15 రోజులుగా దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ అస్వస్థతకు గురికావడమే. ఆయనను ఆసుపత్రిలో చేర్చడంతో నిరసనలు పెల్లుబికి హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు, ఒక సీఆర్‌పీఎఫ్‌ వాహనానికి నిప్పుపెట్టారు, మరియు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో లేహ్ నగరం మార్మోగుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లడఖ్ ప్రజల డిమాండ్లను నెరవేర్చకపోవడంపై కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News