Kulgam Encounter News: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్

Kulgam Encounter News updates: జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లా తంగ్‌మార్గ్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్

Update: 2025-04-23 14:07 GMT

Kulgam Encounter News updates: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా తంగ్‌మార్గ్ ప్రాంతంలో టెర్రరిస్టులు తలదాచుకున్నట్లు భద్రత బలగాలకు స్పష్టమైన సమాచారం అందింది. దాంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఆ చుట్టుపక్కలే ఎక్కడో ఉండి ఉంటారు అని ఆర్మీ బలగాలు వారి కోసం వెతకడం మొదలుపెట్టాయి. మరోవైపు ఉగ్రవాదులను ఎదుర్కునేందుకు భద్రత బలగాలు అనుక్షణం సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.ఈ క్రమంలోనే బుధవారం ఉదయం సరిహద్దు వద్దు దేశంలోకి చొరబడుతున్న ఇద్దరు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుపెట్టింది.

ప్రస్తుతం రక్షణ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇండియాలో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులే ఎక్కువగా ఉన్నట్లు రక్షణ శాఖ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. విదేశీ ఉగ్రవాదులు కాకుండా మరో 17 మంది స్థానిక ఉగ్రవాదులు కూడా చురుకుగా వ్యవహరిస్తున్నట్లు ఇంటెలీజెన్స్ వర్గాలు తెలిపాయి. 

Tags:    

Similar News