టోల్ ఫీజు కట్టమంటే.. మహిళా ఉద్యోగినిపై దాడి..!

Update: 2019-06-21 11:54 GMT

హర్యానాలోని ఓ టోల్ ప్లాజా దగ్గర కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఖేర్కి దౌలా టోల్ ప్లాజాలో ఉన్న ఉద్యోగి కారు డ్రైవర్ ను ట్యాక్స్ కట్టాలని సూచించింది. అయితే కారు డ్రైవర్ టోల్ ప్లాజా మహిళా ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళా ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.


  

Tags:    

Similar News