Mallikarjun Kharge: ఎన్డీయే సర్కార్‌పై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Mallikarjun Kharge: మోడీ ఎన్డీయే సర్కార్ ఏ క్షణమైనా కూలిపోతుంది
Mallikarjun Kharge: ఎన్డీయే సర్కార్‌పై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
Mallikarjun Kharge: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఏ క్షణమైనా కూలిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కారు పొరపాటుగా ఏర్పాటైందని, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి సంఖ్యాబలం లేదన్నారాయన. ఇది మైనార్టీ ప్రభుత్వం. ఎన్డీయే సర్కారు ఎప్పుడైనా కూలిపోవచ్చు. కానీ, ప్రభుత్వం కూలిపోవాలని మేం కోరుకోవట్లేదన్నారు. దేశానికి మంచి జరగాలని, అందుకోసం కలిసికట్టుగా పనిచేయాలనే మేం ఆశిస్తున్నామన్నారు ఖర్గే. కానీ ప్రధానికి మాత్రం మంచిని కొనసాగించే అలవాటు లేదని విమర్శలు గుప్పించారు. ఏదేమైనప్పటికీ దేశాన్ని బలోపేతం చేయడం కోసం మేం పూర్తి సహకారం అందిస్తామన్నారు ఖర్గే. ఐతే ఖర్గే వ్యాఖ్యలపై.. బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలను గుర్తుచేస్తూ ఖర్గేపై విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మెజార్టీ రాకుండానే పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలను నడిపించలేదా? కాంగ్రెస్ చరిత్ర గురించి ఖర్గేకు గుర్తులేదా?’’ అని ఎన్డీయే నేతలు ఎద్దేవా చేశారు.