Mallikarjun Kharge: బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఖర్గే ఫోన్
Mallikarjun Kharge: ఇండియా కూటమి గురించి నితీష్‌తో మాట్లాడిన ఖర్గే
Mallikarjun Kharge: బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఖర్గే ఫోన్
Mallikarjun Kharge: బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫోన్ చేశారు. ఇండియా కూటమికి సంబంధించిన విషయాలపై మాట్లాడారు. కొన్నాళ్లుగా ఇండియా కూటమిపై బీహార్ సీఎం నితీష్ కుమార్ అసంతృప్తిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నితీష్ కాస్త గ్యాప్ మెయింటెన్ చేస్తుండటంతో... కూటమిలో ఐక్యత దెబ్బతిందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల బీజేపీతో తమకు ఫ్రెండ్ షిప్ ఉందని నితీష్ చేసిన వ్యాఖ్యలు కూడా కూటమిలో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో నితీష్‌కు ఫోన్ చేశారు మల్లిఖార్జున ఖర్గే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం మరోమారు కూటమి భేటీ అవుతుందని చెప్పారు.