Kidney Racket: కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్.. ప్రధాని సూత్రధారి హైదరాబాద్ డాక్టర్ !
కిడ్నీ రాకెట్ కేసులో సబిత్ అనే యువకుడు అరెస్ట్
Kidney Racket: కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్.. ప్రధాని సూత్రధారి హైదరాబాద్ డాక్టర్ !
Kidney Racket: కేరళలో మరో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ కిడ్నీ రాకెట్ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందని కేరళ పోలీసు వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్ కు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్లు చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఆపరేషన్లు చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో నిందితుడు సబిత్ ఇచ్చిన సమాచారంతో...కేరళ పోలీసులు హైదరాబాద్ చేరుకుని కూపీ లాగుతున్నారు.